భారత్-చైనా సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత పెరిగిపోతోంది. సోమవారం అర్ధరాత్ర తర్వాత చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన ఓ ఆర్మీ అధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారు. కొద్ది రోజులుగా భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకుని వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని లడ్డఖ్ లో సుమారు 35 కిలోమీటర్ల భూభాగంలోకి చైనా సైన్యం చొరబడిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా చైనా ఆర్మీ భారత్ జవాన్లను రెచ్చ గొడుతోంది. […]
సరిహద్దుల ప్రాంతంలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే చైనా సైనిక చర్యకు దిగుతోందని అందరికీ అర్ధమైపోతోంది. తాజగా జమ్మూ-కాశ్మీర్ లోయ లడ్డాఖ్ లోని గాల్వాన్, పాంగాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల భారత్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసింది. పై ప్రాంతంలో సుమారు 10 వేల డ్రాగన్ సైనికులు తిష్టవేశారు. దాంతో 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించేసిందా అనే టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ మూడో వారం నుండి పై ప్రాంతాల్లోని అన్నీ వైపుల నుండి […]