iDreamPost
android-app
ios-app

భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత… ముగ్గురి మృతి

  • Published Jun 16, 2020 | 7:59 AM Updated Updated Jun 16, 2020 | 7:59 AM
భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత… ముగ్గురి మృతి

భారత్-చైనా సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత పెరిగిపోతోంది. సోమవారం అర్ధరాత్ర తర్వాత చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత్ కు చెందిన ఓ ఆర్మీ అధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారు. కొద్ది రోజులుగా భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకుని వచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంలోని లడ్డఖ్ లో సుమారు 35 కిలోమీటర్ల భూభాగంలోకి చైనా సైన్యం చొరబడిన విషయం అందరికీ తెలిసిందే.

చాలా కాలంగా చైనా ఆర్మీ భారత్ జవాన్లను రెచ్చ గొడుతోంది. సరిహద్దు ప్రాంతాలో రెండు దేశాల జవాన్ల మధ్య చెదురు మదురు సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఆ మధ్య తవ్ర ఉద్రక్త పరిస్ధితులు తలెత్తినపుడు రెండు దేశాల సైనిక జనరళ్ళ మధ్య చర్చలు కూడా జరిగాయి. భవిష్యత్తులో ఎవరు కూడా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకూడదనే ఉద్దేశ్యంతోనే రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు చర్చలు జరుగుతునే మరోవైపు చైనా తన సైన్యాన్ని భారీగా భారత్ భూభాగంలోకి దింపేసింది. యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు దిగటానికి వీలుగా వేదికలను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా మోర్టార్ల ప్రయోగానికి వీలుగా వేదికలను కూడా ఏర్పాటు చేసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య మొదలైన చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇటువంటి సమయంలో హఠాత్తుగా సోమవారం అర్ధరాత్రి తర్వాత భారత్ నుండి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోయినా డ్రాగన్ సైన్యం మాత్రం రెచ్చిపోయింది. ఉత్తపుణ్యానికే ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. మరి దీని పర్యవసానం ఎలాగుంటుందో చూడాల్సిందే.