విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ పదవి రిజర్వేషన్ మార్పు జరిగింది. వాస్తవానికి అన్నీజిల్లాల జడ్పి చైర్మన్ పదవులకు రోష్టర్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి జనవరి 3న గెజిట్ విడుదల అయింది. అంటే అది ఫైనల్ అన్నమాట సూర్యుడు పడమర ఉదయించినా గానీ గెజిట్లో వచ్చింది మారదు.. కానీ విజయనగరం లో మాత్రం ఒక వ్యక్తికి పదవి అప్పగించే. నిమిత్తం ఈ మార్పు చేస్తూ మళ్ళీ గెజిట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వాస్తవానికి ముందు విడుదల చేసిన […]
కొన్ని సార్లు సైలెన్స్ కూడా చాలా వయలెన్స్ గా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ప్రతిపక్షాలకు అలానే ఉంది. సీఎం జగన్ మౌనం టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు అదే రీతిలో కనిపిస్తోంది. రాష్ట్రమంతా రాజధాని అంశంపై సాగుతున్న చర్చపై సీఎం కనీసం కూడా మాట్లాడడం లేదు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఎంత రాద్దాంతం చేస్తున్నా సీఎం మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు అన్నీ మానుకుని అమరావతి అంశం చుట్టూ తిరుగుతున్నా జగన్ మాత్రం […]
రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంశాల పై ప్రభుత్వం నియమించిన జియన్ రావ్ కమిటీ మరియు బోస్టన్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలను క్షుణ్ణంగా, కూలంకుషంగా అధ్యయనం చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27 న మంత్రి వర్గ తీర్మానం ద్వారా నియమించిన హైపవర్ కమిటీ ఈ రోజు తొలిసారిగా భేటీ అవ్వనుంది. విజయవాడలోని ఏపి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. హైపవర్ కమిటీలో ఉన్న మొత్తం 10 మంది మంత్రులతో పాటు ఆరుగురు ఉన్నతాధికారులు […]
ఒకవైపు విశాఖని కార్యనిర్వాహక రాజధాని గా చేస్తామంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన, తదనంతరం రాజధాని పై జియన్ రావు కమిటీ తుది నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదిక లో కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకి బలం చేకూర్చుతూ విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా చెయ్యాలని సూచించడం, మంత్రులు విశాఖకు అనుకూలంగా ప్రకటనలు చేస్తుండడంతో పాటు ఈ నెల 27 న విశాఖలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో 3 రాజధానులు అంశంపై పలు కీలక […]
అందుబాటులో ఉన్న వనరులతో విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని తరలింపు పేరుతో తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని తానే అభివృద్ధి చేశానంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ, సచివాలయం మాత్రమే ఉంటే రాజధాని అభివృద్ధి చెందదని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐటీ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుందని, ఆ రోజే మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధాని పై జరుగుతున్న పరిణామాలపై మీడియాతో మాట్లాడిన బొత్స జీఎన్ రావు కమిటీ నివేదికపై స్పందించారు. ఆ కమిటీ రాజధానిపై కొన్ని కీలక సూచనలు చేసిందని, ఈ నివేదిక లోని అన్ని అంశాల మీద ఈ […]
పట్టణ పాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాబోవు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల పై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. జనవరి లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు చక చకా ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్లు ముద్రించాలని ఎన్నికల సంఘం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ఈ నెలాఖరు లోపు బ్యాలెట్ ముద్రణ పూర్తి చేయనున్నారు. సర్పంచ్, వార్డు […]