మోడీ పాలనలో అన్నీ సంచలనాలే. హఠాత్తు నిర్ణయాలే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ అంచనాలకు అందని రీతిలో విధానాలే. కానీ ఇప్పుడు అనూహ్యంగా మోడీ తన నిర్ణయానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. లాక్ డౌన్ సడలించే ఆలోచన గురించి ఆయన ప్రస్తావించారు. తన మనసులో మాటను ముఖ్యమంత్రుల ముందు బయటపెట్టారు. ఒకసారి లాక్ డౌన్ సడలిస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తారని ఆయనే చెప్పారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు కసరత్తులు చేయాలని సూచించారు. […]