ఓటిటిల ప్రభావమో లేక విజువల్ గ్రాండియర్లకు ప్రేక్షకులు అలవాటు పడటమో కారణం ఏదైతేనేం రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. వీటికి టాక్ బాగున్నా సరే జనాన్ని థియేటర్ దాకా రప్పించడం, రెండు మూడు వారాలు దాన్ని హాళ్లలో రన్ అయ్యేలా చూడటం నిర్మాతలకు పెనుసవాల్ గా మారుతోంది. దీనికన్నా డిజిటల్ లో రిలీజ్ చేసుకోవడం సుఖమనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవలే విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం చూడొచ్చనే టాక్ తెచ్చుకున్నప్పటికీ సర్కారు […]
ఆచార్య కథ దాదాపు ముగిసిపోయినట్టే. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మరీ ఈ రేంజ్ డిజాస్టర్ ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత తన కం బ్యాక్ పీరియడ్ లో ఇలాంటి ఫలితం అందుకోవడం మెగాస్టార్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి. ట్రేడ్ చెబుతున్న రిపోర్ట్స్ ప్రకారం రెండో వారంలో కూడా ఆచార్య కొనసాగితే డెఫిసిట్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. […]