iDreamPost
పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి.
పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి.
iDreamPost
ఆచార్య కథ దాదాపు ముగిసిపోయినట్టే. బ్యాడ్ టాక్ వచ్చినా కూడా మరీ ఈ రేంజ్ డిజాస్టర్ ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత తన కం బ్యాక్ పీరియడ్ లో ఇలాంటి ఫలితం అందుకోవడం మెగాస్టార్ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఆచార్య కంటే నెల క్రితం రిలీజైన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వసూళ్లు బాగున్నాయి. ట్రేడ్ చెబుతున్న రిపోర్ట్స్ ప్రకారం రెండో వారంలో కూడా ఆచార్య కొనసాగితే డెఫిసిట్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాబోయే కొత్త సినిమాల మీద అందరి దృష్టి ఉంది. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం, శ్రీవిష్ణు భళా తందనాన, సుమ జయమ్మ పంచాయితీ పోటీ పడుతున్నాయి.
ఆశ్చర్యకరంగా వీటిలో దీని మీద హైప్ లేదు. ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చేసి లాభం లేదు. టాక్ మీద ఆధారపడాల్సిందే. విశ్వక్ తన మూవీ కోసం నిన్న ప్రాంక్ పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద కామెడీ చేయడం విమర్శల పాలైంది. దానికి తోడు టీవీ ఛానల్ స్టూడియోకు వెళ్లి యాంకర్ తో గొడవ పెట్టుకున్నంత పని చేయడం రకరకాల చర్చలకు దారి తీసింది. ఇది ఎంతమేర బజ్ కు తోడవుతుందో చెప్పలేం. ఇక శ్రీవిష్ణు భళా తందానాన గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. ప్రమోషన్ వీక్ గా ఉండటంతో జనరల్ ఆడియన్స్ కి ఇది వస్తున్నట్టు తెలియదు. ఇక సుమ జయమ్మ పంచాయితీని జనం థియేటర్లకు వచ్చి చూస్తారా అనేది అనుమానమే. టీమ్ నమ్మకంతో ఉంది మరి
కానీ ఈ మూడు సినిమాలను డాక్టర్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్ భయపెడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో వేగంగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. పైన చెప్పిన వాటికి ఇంకా ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు మొదలే కాలేదు. ఈలోగా డాక్టర్ రచ్చ చేస్తున్నాడు. స్పైడర్ మ్యాన్ తరహాలో దీనికీ భారీ ఫాలోయింగ్ ఉంది. పిల్లలు సెలవులు కావడంతో డాక్టర్ ని చూసేందుకు ఎగబడుతున్నారు. బిసి సెంటర్స్ లో కాదు కానీ నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో భారీ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. మరి గ్రాండియర్లు కాని ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా నెగ్గుకొస్తాయో చూడాలి