iDreamPost
android-app
ios-app

చిన్న సినిమాలూ – పారా హుషార్

  • Published May 18, 2022 | 11:20 AM Updated Updated May 18, 2022 | 11:20 AM
చిన్న సినిమాలూ – పారా హుషార్

ఓటిటిల ప్రభావమో లేక విజువల్ గ్రాండియర్లకు ప్రేక్షకులు అలవాటు పడటమో కారణం ఏదైతేనేం రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. వీటికి టాక్ బాగున్నా సరే జనాన్ని థియేటర్ దాకా రప్పించడం, రెండు మూడు వారాలు దాన్ని హాళ్లలో రన్ అయ్యేలా చూడటం నిర్మాతలకు పెనుసవాల్ గా మారుతోంది. దీనికన్నా డిజిటల్ లో రిలీజ్ చేసుకోవడం సుఖమనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవలే విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం చూడొచ్చనే టాక్ తెచ్చుకున్నప్పటికీ సర్కారు వారి పాట కేవలం వారం గ్యాప్ లో రావడం వల్ల కలెక్షన్లను పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోయింది. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో పెద్దగా రాలేదు.

దీనికే కాదు గత కొన్నేళ్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన చాలా చిన్న సినిమాలు ఈ కారణంగానే చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టుకోలేకపోయాయి. ఒక్క డిజె టిల్లు మాత్రమే దీనికి ఎదురీది సూపర్ హిట్ అనిపించుకుంది. అఫ్కోర్స్ ఇది తీసింది కూడా పెద్ద బ్యానరనే సంగతి మర్చిపోకూడదు. శ్రీవిష్ణు రాజరాజ చోర బెటర్ గానే ఆడింది. ఇవి మినహాయిస్తే మిగిలినవన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినవే. కొన్ని మరీ అన్యాయంగా అసలు విడుదలైన సంగతే పబ్లిక్ కి తెలియనంత వేగంగా వచ్చి వెళ్తున్నాయి. టీవీలో ప్రకటనో పేపర్ లో యాడో చూసినప్పుడు ఆ ఓటిటిలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న వాళ్లే ఎక్కుడ

ఇప్పటికిప్పుడు దీన్ని మార్చలేం కానీ ఇకపై నిర్మాతలు ప్రొడక్షన్ కు వెళ్ళటానికి ముందే అసలు తమ సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేస్తుందా లేక ఓటిటికి ఇచ్చుకుంటే మంచి లాభాలు వస్తాయా అనేది ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అంతే తప్ప టైటిల్ కార్డుని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం కోసం మాత్రమే అయితే నష్టాలకు సిద్ధపడి ఉండాలి. దానికి తోడు గత రెండు నెలలుగా ప్రతి శుక్రవారం ఏదో ఒక పెద్ద సినిమా ఉంటోంది. ఆడియన్స్ వాటికి ఇచ్చిన ప్రాధాన్యత చిన్న చిత్రాలకు ఇవ్వరు. ముఖ్యంగా ఓటిటిలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో చిన్న సినిమాలు ఆషామాషీగా వస్తామంటే కుదరదు. కంటెంట్ బలంగా ఉండాల్సిందే