2014లో కేంద్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒక్కొక్క రాష్ట్రం హస్తం పార్టీ నుంచి చేజారిపోతున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. పంజాబ్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమించింది. ఇక మిగిలింది రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మాత్రమే. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు అందరు పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. ఓ పక్క రాష్ట్రాలు చేజారిపోతుండడం, […]
రాజస్థాన్లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఊహించిన విధంగానే వచ్చాయి. ఇవాళ జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బిజెపికి ఒకస్థానం దక్కింది. రాజస్థాన్లో ఖాళీగా ఉన్న మూడు స్థానాలలో ప్రతిపక్ష బిజెపి రెండిటిలో విజయం కోసం ఢిల్లీ పెద్దల అండదండలతో వ్యూహాలు రచించిన ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ వేణు గోపాల్, నీరజ్ డాంగి విజయం సాధించగా బిజెపి […]
రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. రాజస్థాన్, గుజరాత్ లోనే ఇలా ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. రాజ్యసభ ఖాలీలు కంటే ఎక్కువ మంది పోటీ చేయడం…ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. క్యాంప్ లకు తరిలించి ఎమ్మెల్యేలను బిజెపి వైపు వెల్లకుండా నిలువరిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ […]
కాంగ్రెస్ను పడగొట్టేందుకు కుట్రా..? రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిందా? ఈ నెల 19న రాజస్థాన్లోని 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ సుస్థిరతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతిపక్ష బిజెపి తమ ఎమ్మెల్యేలను ఎగరేసుకుపోవచ్చన్న భయంతో సిఎం అశోక్ గెహ్లాట్ ఆదేశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ-జైపూర్ హైవేపై శివ్ సిలాస్ రిసార్టుకు తరలించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బిజెపి నైజమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి […]
రాజస్థాన్లో మళ్లీ వారి ఇద్దరి మధ్య వార్ మొదలైంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాదు. పరోక్షంగా పిసిస అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ రెండోతరం నేతలు, యువ నేతలపై కూడా గెహ్లాట్ విరుచుకుపడ్డారు. యువనేతలు ఏమాత్రం కార్యక్షేత్రంలో పనిచేయడం లేదని, అయినా సరే.. కాంగ్రెస్ హై కమాండ్ వారిని కేంద్ర మంత్రులు, పిసిసి అధ్యక్షులను చేసేస్తోందని విమర్శలు చేశారు. అయితే ఎవరి పేరెత్తకుండానే అన్యాపదేశంగా సచిన్ పైలెట్ను […]