తేల్చుకుంటామంటున్న కాంగ్రెస్ మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ (మహా వికాస్ అగడి) ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు తలెత్తాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల పంపకంలో పంచాయతీ ఏర్పడింది. ఇప్పటికే పంపకం అయిపోయినా…దాన్ని కాంగ్రెస్ ససేమిరా అంటుంది. మూడు పార్టీలకు సమానంగా పంపాలని, ఒక పార్టీకి ఎక్కువ మరో పార్టీకి తక్కువ వద్దని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనకు ఐదు సీట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపి)కి నాలుగు, […]
మహారాష్ట్రలోని మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వం దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా కొనసాగుతుంది.కాగా అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య అభిప్రాయ భేదాలలకు కొంతమంది అధికారులు కారణమని కాంగ్రెస్ నేత అశోక్ చౌహాన్ ఆరోపించడం ఆశ్చర్యపరుస్తోంది. మహారాష్ట్రలోని అధికార సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమేనని మహారాష్ట్ర పిడబ్ల్యుడి మంత్రి,కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అంగీకరించారు. శివసేన నేతృత్వంలోని అధికార సంకీర్ణంలో కాంగ్రెస్ గత కొంతకాలంగా అసంతృప్తి […]