ఏపీ శాసనమండలి సెలక్ట్ కమిటీ వ్యవహారం ముదురుతోంది. ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఇప్పటికే మండలి రద్దు ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వైఎస్సార్సీపీ నేతలు సెలక్ట్ కమిటీకి సహకరించకూడదనే సంకల్పంతో ఉన్నారు. తాము గుర్తించడం లేదని ఇప్పటికే ప్రకటించారు. కానీ టీడీపీ మాత్రం చైర్మన్ సహాయంతో ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. దానికి తగ్గట్టుగా చైర్మన్ షరీఫ్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. బీజేపీ, పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీల జాబితాతో […]