హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన రిప్లై కౌంటర్లో అడ్డుగోలు సమర్ధింపులే కనబడుతున్నాయి. ఎన్నికల వాయిదా విషయంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికే నిమ్మగడ్డ అవస్తలు పడుతున్న విషయం తెలిసిపోతోంది. కోర్టుకు సమర్పించిన రిప్లైలో ఎన్నికల వాయిదా నిర్ణయం పూర్తిగా రహస్యమని, ఎవరితోను చర్చించాల్సిన అవసరం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు ఐఏఎస్ అధికారిగా చేసిన నిమ్మగడ్డకు ఎన్నికలంటే ప్రజలకు, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తప్పించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈరోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డ తో పాటు మరో కొంత మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేయనుంది. ఈ అంశంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ తమ వాదనలను వినిపిస్తూ అఫిడవిట్లు […]
కరోనా వైరస్ నేపధ్యంలో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా వివాదస్పదమైంది. స్ధానిక సంస్ధల్లో లబ్ది పొందటం కోసమే ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అధికారపార్టీ అభ్యర్ధులు తమ చేతుల మీదగా పంపిణి చేస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖరాశారు. అంతకుముందే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అధికారపార్టీపై ఇటువంటి ఆరోపణలే చేశారు. కన్నా నుండి వచ్చిన లేఖ ఆధారంగా నిమ్మగడ్డ వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు […]
ప్రస్తుతం జరగబోయే స్థానిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తమయ్యాయి. మంత్రాంగాలతో యంత్రాంగాలను కదలించే పనిలో పడ్డాయి. అదే క్రమంలో అధికార వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్టుగా జెడ్పీ,మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన తన మనసులో మాటను ఇప్పటికే జగన్ పార్టీ నేతలకు తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించినట్టుగా ఫలితాల తర్వాత తగిన నేతలను మేయర్, జెడ్పీ పీఠాలకు ఎంపిక చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రాంతీయంగా వివిధ నేతలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ […]
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు కొట్టివేయడం, 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనంటూ టీడీపీ, కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రిం కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. తన పార్టీ నేతతోనే ఎన్నికలు వాయిదా పడేలా రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పటిషన్లు వేయించిన టీడీపీ.. ఇప్పుడు […]
తమది బీసీల పార్టీ, బీసీలే తమ పార్టీకి వెన్నుముక.. అంటూ చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటలను నిజంగానే అంటున్నారా..? లేదా..? రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే అంటున్నారా..? అంటే.. ఓట్ల కోసమే అని తాజాగా జరిగిన ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్లు వేయాలి కానీ ఓట్లు వేయించుకుని పదవులు అలంకరిస్తామంటే ఎలా..? అనే విధంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వారికి రాజకీయాధికారం దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్థానిక […]