సర్కారు బడి అంటే.. ఒకప్పుడు తెలుగు మీడియంకే పరిమితం. అందుకే కార్పొరేట్ పాఠశాలలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం పేరుతో కార్పొరేట్ చేస్తున్న దోపిడీ నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేందుకు.. ఏపీ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం రాకతో సర్కారు బడులు గతంలో ఎన్నడూ లేనంత కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు బడుల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే.. […]
ఏదైనా ఓ పథకం కింద ప్రభుత్వం వంద రూపాయలు ప్రజలకు ఇస్తే.. వివిధ చేతులు మారి ప్రజలకు చేరే సరికి ఈ మొత్తం పది రూపాయలే ఉంటుందని దేశంలో ప్రభుత్వాల పనితీరుపై ఓ నానుడి ఉంది. రాజకీయ, అధికార అవినీతికి ఈ మాటలు అద్దం పట్టేవి. ఈ పరిస్థితి మారడం సాధ్యం కాదనుకున్నారు. కానీ దృఢ సంకల్పంతో సాధ్యం కానిదంటూ లేదని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకే […]
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల. కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ నటించిన ఓ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన పాట. కానీ తాజాగా గురువారం ఏపీ అంతటా మావయ్య అన్న పిలుపు మార్మోగింది. లక్షలాది మంది విద్యార్థులు మావయ్య అంటూ సంభోధించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా కానుక అందుకున్న […]