iDreamPost
android-app
ios-app

CM జగన్ ముందు ఇంగ్లీషులో అదరగొట్టిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ అందించే కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పర్యటించారు. చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు విన్నారు..

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ అందించే కార్యక్రమాన్ని చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పర్యటించారు. చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు విన్నారు..

CM జగన్ ముందు ఇంగ్లీషులో అదరగొట్టిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించారు. ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకువచ్చారు. ఏ విద్యార్థి బడికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి వంటి పథకాలను తీసుకువచ్చారు. దీంతో డ్రాఫర్ సంఖ్య నానాటికి తగ్గింది. చదువుకునే వారి సంఖ్య పెరిగింది. విద్యా రంగంలో చేసిన సంస్కరణలతో విద్యార్థులు విదేశాల్లో కూడా సత్తా చాటారు. ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రసంగించిన సంగతి విదితమే. అలాగే ప్రతి ఏటా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నారు.

ఈ ఏడాది కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం ట్యాబ్స్ పంపిణీ చేపట్టారు. చింతపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని.. విద్యార్థులకు ట్యాబ్స్ అందించారు. అంతకముందు చింతపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిజిటల్‌ క్లాసులు విన్నారు. ముఖాముఖిలో పాల్గొన్నారు. ట్యాబ్స్ పంపిణీ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. ధారామణి అనే ప్రభుత్వ పాఠశాల బాలిక సీఎం జగన్ ముందే స్పీచ్ అదరగొట్టింది. తెలుగు, ఇంగ్లీషు స్పీచుల్లో విద్యారంగంలో జగన్ చేసిన మంచి పనులు గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడింది. ఆ మాటలకు జగన్‌తో సహా అక్కడ ఉన్న వారంతా బాలికను మెచ్చుకున్నారు.

‘ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న దృఢ సంకల్పంతో నాలుగన్నరేళ్లుగా కనివిని ఎరుగని పథకాలను ప్రభుత్వ విద్యారంగంలోకి తీసుకువచ్చిన పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, గిరిజన ప్రజల పక్షపాతి, పేద ప్రజల గుండె చప్పుడు, మాట తప్పని, మడమ తిప్పని మా మేనమామ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, మా గిరిజన ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు’అంటూ విషెస్ చేసింది. ఆ తర్వాత తన గురించి చెబుతూ.. తన తండ్రి పేద రైతు కావడం వల్ల చదివించలేకపోయేవారని, కానీ మీరొచ్చాక.. అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి, నేరుగా మా అమ్మ ఖాతాలో రూ. 15వేలు వేయడం వల్ల ఇప్పుడు తాను చదువుకోగలుగుతున్నానంటూ పేర్కొంది.

’ఒకప్పుడు మా పాఠశాలలు చూస్తే గచ్చులు పగిలిపోయి.. పై కప్పు విరిగిపోయి.. వర్షం నీరు కారేది. ఆ పరిస్థితుల్లోనే చదువుకునేవాళ్లం. నీళ్లు కూడా దొరికేవి కావు. కానీ మా జగన్ మామయ్య సీఎం అయ్యాక..మా పాఠశాల రూపు రేఖలనే మార్చేశారు. మాకు ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అనగానే.. తెలుగు మీడియానికే పరిమితం అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పాఠశాలను ఇంగ్లీషు మీడియంగా మార్చారు. మా ఊర్లో డబ్బు ఉన్న విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. నేను మాట్లాడలేనా అని అనుకునేదాన్ని. కానీ సీఎం సర్ వచ్చాక.. ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేశాక నేను కూడా ఇంగ్లీషులో మాట్లాడగల్గుతున్నాను’ అంటూ ఇంగ్లీషులో స్పీచ్ అదరగొట్టేసింది.

’మాకు నాణ్యమైన బ్యాగ్, టెస్ట్ బుక్స్, సాక్సులు, డిక్షనరీ అందిస్తున్నారు. తమకు ప్రతి నెలా శానిటరీ నాపికన్ అందిస్తున్నారు. గోరు ముద్దలో భాగంగా మంచి భోజనాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు పౌష్టికాహారాన్ని తీసుకుని.. ఆరోగ్యంగా ఉన్నామంటూ’ పేర్కొంది. ఆణిముత్యాలు ద్వారా టాపర్లను, వారి కుటుంబాన్ని సీఎం జగన్ సత్కరిస్తున్నారని వెల్లడించింది. ఈ సందర్భంగా జగన్ మెహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది.  ఆమె స్పీచ్ కు ముఖ్యమంత్రి ఫిదా అయ్యి.. విద్యార్థినిని దీవించారు.