iDreamPost
ఇంగ్లీష్ మీడియం పేరుతో కార్పొరేట్ చేస్తున్న దోపిడీ నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేందుకు.. ఏపీ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం రాకతో సర్కారు బడులు గతంలో ఎన్నడూ లేనంత కళకళలాడుతున్నాయి.
ఇంగ్లీష్ మీడియం పేరుతో కార్పొరేట్ చేస్తున్న దోపిడీ నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేందుకు.. ఏపీ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం రాకతో సర్కారు బడులు గతంలో ఎన్నడూ లేనంత కళకళలాడుతున్నాయి.
iDreamPost
సర్కారు బడి అంటే.. ఒకప్పుడు తెలుగు మీడియంకే పరిమితం. అందుకే కార్పొరేట్ పాఠశాలలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం పేరుతో కార్పొరేట్ చేస్తున్న దోపిడీ నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేందుకు.. ఏపీ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం రాకతో సర్కారు బడులు గతంలో ఎన్నడూ లేనంత కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు బడుల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే.. అడ్మిషన్లు అయిపోయాయి అని చెప్పేంతగా అంటే.. అతిశయోక్తి కాదు. అందుకు కారణాలను పరిశీలిస్తే.. మొదటిగా కనిపించేది కరోనా.
కరోనా రాకతో దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కుదేలయ్యాయి. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు సాగక ఇల్లు గడవడమే కష్టతరంగా మారింది. అలాంటిది పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితి. అలాంటి విద్యార్థులంతా సర్కారు బడులవైపే మొగ్గు చూపుతున్నారు. సర్కారు బడుల్లోనూ ఇంగ్లీష్ మీడియం ఉండటంతో.. అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర మందికి పైగా కొత్తవిద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బడి బాట కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహిస్తే.. అడ్మిషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం.
రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా.. ఆయా విద్యాసంస్థల్లో 30 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు మినహాయిస్తే 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. వీటిలో 23.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.12 వేల కోట్లను స్కూళ్ల అభివృద్ధికి కేటాయించింది ప్రభుత్వం. సర్కారు బడుల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తల్లిదండ్రులు ఆకర్షితులై.. ప్రైవేటు బడుల్లో చదువుతున్న తమ పిల్లలను సర్కారీ బడుల్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించడం కొత్త అడ్మిషన్లకు కలిసొచ్చిందనే చెప్పాలి. అడ్మిషన్లు మొదలైన 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,50826 మంది కొత్తవిద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరు వరకూ ఉంటుందని, రోజుకు 10 వేల అడ్మిషన్లు చేరినా.. అడ్మిషన్లు ముగిసేసమయానికి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటుందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.