ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. మంత్రివర్గ కూర్పులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం.. టీడీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే విషయంలో వైఎస్ జగన్ అనుసరించిన చారిత్రాత్మక విధానం ఏపీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకడం టీడీపీ నేతల ఆందోళనకు ప్రధాన కారణం అయింది.మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన సీఎం వైఎస్ జగన్.. కేబినెట్‌లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించి చారిత్రాత్మక నిర్ణయం […]
ప్రజలతో వినయంగా నడుచుకునే తీరు.. పార్టీ పట్ల విధేయత.. అప్పగించిన బాధ్యతలను విధులను సమర్ధవంతంగా నిర్వహించే నేర్పు.. విపక్షాల కుట్రలను స్పష్టంగా చెప్పగలిగే వాగ్దాటి.. డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. వీటి వల్లే రాజకీయాల్లో రికార్డు సృష్టించిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. రెండో సారి మంత్రి అయి పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సంపాదించుకున్నారు. వైద్య రంగంలో కొనసాగుతున్న ఆయన అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి.. సుదీర్ఘంగా […]
వేగంగా నిర్ణయాలు తీసుకునే సీఎం వైఎస్ జగన్.. మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు గంటల వ్యవధిలోనే మంత్రులకు శాఖలు కేటాయించారు. సోమవారం మధ్యాహ్నం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. గంటల వ్యవధిలో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడంతోపాటు గతంలో పాటించిన సాంప్రదాయాన్నే ఈసారి కొనసాగించారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజికవర్గ నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రులకు కేటాయించిన శాఖలు.. 1. […]
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం కొలువుతీరింది. పండగ వాతావరణంలో నూతన మంత్రులు ప్రమాణం చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా తాజా, మాజీ మంత్రులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇంగ్లీష్ వర్ణమాల […]
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హాట్ టాపిక్ గా మారింది. ముందు 90% మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి కేవలం 10 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ వైఎస్ జగన్ దానికి భిన్నంగా 10 మంది పాత మంత్రులను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరగా విడుదలైన లిస్టులో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లు కనిపించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. మొత్తం కేబినెట్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నూతన మంత్రివర్గ ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు ఎలాఉండాలన్న అంశంపై సీఎం జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్‌తో సుదీర్ఘ సమయం భేటీ కాగా.. ఈ రోజు మరోసారి సమావేశమయ్యారు. పాత, కొత్త కలయికతో నూతన […]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేసిన సమయంలో రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని ప్రకటించారు. అయితే కరోనా తదితర అంశాల కారణంగా అది కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లోని మంత్రులందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి రాజీనామాలు సమర్పించారు. కొత్తగా మంత్రులు ఏప్రిల్ 11వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రులతో పాటు పాత మంత్రులు కూడా […]
సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీలో చీలిక వస్తుందని టీడీపీ ఆశలు పెట్టుకుంది. శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. మంత్రి మండలిలో మార్పు ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించారని, జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని యనమల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ముందుగా చెప్పినట్టుగానే మంత్రివర్గంలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలియనట్టు యనమల రాజకీయ […]
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏపీ చరిత్రలోనే మరో సంచలనానికి తెర తీశారు. రెండున్నరేళ్లకే కేబినెట్ లోని మొత్తం మంత్రులతో రాజీనామాలు చేయించారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఆదిలోనే ఈ విషయం మంత్రులకు స్పష్టంగా చెప్పారు. 2019 మే 30న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 8న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. […]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది.సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. పలు అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే మంత్రులు అందరూ రాజీనామా చేశారు. వారి వారి లెటర్ హెడ్‌లో రాజీనామాలు చేసిన మంత్రులు వాటిని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందజేశారు. ఈ నెల 11వ తేదీన నూతన కేబినెట్ కొలువుతీరబోతోంది. అందుకు అనుగుణంగా ఈ రోజు మంత్రులు అందరూ రాజీనామా […]