P Venkatesh
ఎప్పటి నుంచో టీచర్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఏపీ క్యాబినెట్ డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చించి ఆమోదం తెలిపింది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఏపీ క్యాబినెట్ తీపి కబురును అందించింది. ఏపీ క్యాబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ కేబినెట్ లో చర్చించారు. ఎపీలో డీఎస్సీ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 6 వేల సోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో డీఎస్సీ నోటిఫికేషన్ రేపోమాపో వస్తుందంటూ ఊహాగానాలు వచ్చిన వేళ నేడు కేబినెట్ బేటీతో డీఎస్సీ నోటిఫికేషన్ కు రూట్ క్లియర్ అయింది. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి పోస్టుల వివరాలను తెలుసుకుని ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ క్యాబినెట్ ఆమోదంతో డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.