Arjun Suravaram
Metro in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖ వాసులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
Metro in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖ వాసులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వాసులకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రోరైలు రానుంది. నగరంలో మెట్రో రైలు పరుగులు తీసే రోజుల కోసం.. ఇక్కడి వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇటీవలే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. విశాఖ ప్రజల కల నెరవేరబోతోంది. తాజాగా విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలు, ప్రజా రావాణాను వ్యవస్థను పరిగణలోకి తీసుకొని దీనిని మరింత పటిష్ఠం చేసి ముందుకు నడిపించేందుకు కృషి చేస్తోంది. దీనిపై తాజాగా ఆమోదించబడిన డీపీఅర్లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇటీవలే విశాఖలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అలాగే డీపీఅర్ ప్రకారం విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం.. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం.. తొలి విడతలో 76.90 కిలో మీటర్ల మేర వరకు లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం చేయునున్నారు. కాగా, నిధుల సమీకరణ విషయంలో మరింత వేగవంతం చేయాలని,కేబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించింది. ఇక తాజా అంచనాల ప్రకారం.. విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే మెట్రో నిర్మాణ ప్రతిపాదనలో ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే.. మొత్తం జనాభా 41 లక్షలు మంది ఉన్నారు. ఇక్కడ అభివృద్ధికి తొడ్పడుతుందనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ఇక విశాఖలో ఈ ప్రాజెక్టును డీపీఅర్‌ను ఆమోదించడమే కాకుండా.. వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో నిర్మాణా పనులకు శంకుస్థాపన చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లు సమాచారం వినిపిస్తోంది. కానీ, శంకుస్థాపన చేసే సమయానికి నిధుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేబినెట్లో చర్చలు జరిగాయి. అందుకు తగిన మార్గాలను చూడాలని, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సైతం.. కేబినెట్ ఆదేశించడమే కాకుండా పలు సూచనలు కూడా చేసిందట.