Idream media
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా తాజా, మాజీ మంత్రులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం కొలువుతీరింది. పండగ వాతావరణంలో నూతన మంత్రులు ప్రమాణం చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పక్కన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా తాజా, మాజీ మంత్రులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, ఉన్నతాధికారులు, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఇంగ్లీష్ వర్ణమాల ప్రకారం ఇంటి పేరు ప్రాతిపదికన వరుసగా మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మొదట 11:31 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా.. అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, కాకాని గోవర్థన్ రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, కళత్తూరు నారాయణస్వామి, కేవీ ఉషశ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, పీడిక రాజన్నదొర, ఆర్‌కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని లు ప్రమాణం చేశారు.