ఏపీలో ఇటీవల పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో రెండులక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అవ్వడం సంచలన విషయంగా మారింది. రెండు – మూడు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది. తదుపరి చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు.. నెలరోజుల […]
ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వచ్చాక.. రెండేళ్ల తర్వాత 10 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 2021-22 విద్యాసంవత్సరంలో 6,21,799 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా.. 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.72 శాతం మంది విద్యార్థులు టెన్త్ పాస్ అవ్వగా.. వారిలో బాలురు 64.02 శాతం.. బాలికలు 70.70 శాతం మంది పది […]
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు ఈనెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను వాయిదా వేయాలని నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ను […]
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తెలియజేసిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు […]