iDreamPost
android-app
ios-app

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట.. సప్లీలో పాసైనా..

  • Published Jun 09, 2022 | 11:51 AM Updated Updated Dec 23, 2023 | 6:29 PM

రెండు - మూడు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు.

రెండు - మూడు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు.

టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరట.. సప్లీలో పాసైనా..

ఏపీలో ఇటీవల పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో రెండులక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అవ్వడం సంచలన విషయంగా మారింది. రెండు – మూడు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఒక నిర్ణయం తీసుకుంది.

తదుపరి చదువుకు ఆటంకం లేకుండా ఉండేందుకు.. నెలరోజుల వ్యవధిలోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనుంది. అయితే సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులను కూడా రెగ్యులర్ పాస్ గా ప్రకటించేలా ప్రభుత్వం నిర్ణయించింది. జులై 6వ తేదీ నుంచి 15 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు జూన్ 20లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.