iDreamPost
android-app
ios-app

ఏపీలో పదో తరగతి పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు ఈనెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను వాయిదా వేయాలని నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ను రీ షెడ్యూల్ చేసిన విద్యాశాఖ కొత్త టైం టేబుల్ ను శనివారం విడుదల చేసింది. తాజాగా రూపొందించిన నూతన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతాయి

నూతన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైం టేబుల్:

మార్చి 31:  ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

ఏప్రిల్‌ 1:    ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌ పేపర్‌-2

ఏప్రిల్‌ 3:   సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ)

ఏప్రిల్‌ 4:   ఆంగ్లం పేపర్‌-1

ఏప్రిల్‌ 6:   ఆంగ్లం పేపర్‌-2

ఏప్రిల్‌ 7:   గణితం పేపర్‌-1

ఏప్రిల్‌ 8:   గణితం పేపర్‌-2

ఏప్రిల్‌ 9:   జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1

ఏప్రిల్‌ 11: జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2

ఏప్రిల్‌ 13: సాంఘికశాస్త్రం పేపర్‌-1

ఏప్రిల్‌ 15: సాంఘికశాస్త్రం పేపర్‌-2

ఏప్రిల్‌ 16: సాంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌

ఏప్రిల్‌ 17: వొకేషనల్‌ కోర్స్‌(థియరీ)