ఒకపక్క థియేటర్లో సినిమా లైఫ్ రానురాను కుంచించుకుపోతోంది. వంద రోజులు అనే మాట ఇక కలే. ఎంత పెద్ద హీరో అయినా నెల రోజులు స్క్రీన్లు ఎక్కువ తగ్గకుండా తన సినిమాను ఆడించుకోగలిగితే అది బ్లాక్ బస్టర్ కిందే లెక్క. ఇక చిన్న సినిమాల పరిస్థితి సరేసరి. మహా అయితే రెండు వారాలు. అదీ పోటీగా ఏవి లేకపోతేనే. ఇలాంటి క్లిష్టత ఇండస్ట్రీని సతమతం చేస్తుండగా మరోవైపు పైరసీ భూతం రోజురోజుకి జడలు విప్పుకుంటోంది. కొత్త సినిమా […]