2022–2023 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకే కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ ఆమోదం లభించడంతో.. మరికాసేపట్లో ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మండలి డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను శాసన సభలో మంత్రి […]
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా? ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను అదుపు చేసే అధికారం కూడా వుంటుంది. అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా మూడు దశాబ్దాలు గడిచాయి. అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్. విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై, రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్ […]
ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, తొలితరం జర్నలిస్టులలో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయర ఇవాళ ఉదయం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పత్రికారంగానికి 50 ఏళ్లకు పైగా సేవలందించిన పొత్తూరి తెలుగు జర్నలిజంలో తనదైన ముద్రలు వేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సేవలందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించిన ఆయన ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్తా […]
సెవెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు వచ్చేసరికి కొమ్ములు మొలిచాయి. సినిమా థియేటర్లను కుమ్మడం మొదలు పెట్టాను. అయితే అక్షర జ్ఞానం వచ్చేనాటికే సినిమా పత్రికలు చదవడం అలవాటైంది. విజయచిత్ర, సినిమా రంగం మాసపత్రికలు మా ఊర్లో దొరికేవి. విజయచిత్ర లైబ్రరీకి వచ్చేది. దాని చుట్టూ ఈగల్లా పాఠకులు. చదువుతున్న వాడి పక్కన కూర్చొని చదివేవాడిని. వాళ్లు నిదానంగా పెదవులు కదిలిస్తూ చదివే వాళ్లు. నేనేమో హైస్పీడ్ రీడర్ (ఈ విషయం పదేళ్ల క్రితం నేనే […]
ఈనాడు బాధ్యతల నుంచి అధికారికంగా రామోజీరావు తప్పుకోవచ్చు కానీ ఈనాడు అంటే రామోజీ, రామోజీ అంటే ఈనాడు. అది రాసిన సత్యాసత్యాల గురించి పక్కన పెడితే ఈనాడు అంటే చరిత్ర. ఇంకా నడుస్తున్న చరిత్ర. సద్ది వార్తలతో మధ్యాహ్నం వేళ పాఠకులను చేరే ఆంధ్రప్రభ, పత్రికలని , జర్నలిజం నుంచి తోసేసి, జర్నలిజాన్నే తనవైపు మళ్లించుకుంది ఈనాడు. 1976లో మొదటిసారి ఈనాడుని చూశాను. అనంతపురం లైబ్రరీకి సాయంత్రం వేళ చేరేది. అడాలిసెంట్ వయస్సులో సెక్స్ సైన్స్‌ని దొంగగా […]