iDreamPost
android-app
ios-app

ఖాకీ డ్రెస్సులో కీచకుడు.. మతిస్థిమితం లేని అమ్మాయిపై..

  • Published Mar 23, 2024 | 10:39 AM Updated Updated Mar 23, 2024 | 10:39 AM

ఈ మధ్య మహిళలపై లైంగిక దాడులు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.

ఈ మధ్య మహిళలపై లైంగిక దాడులు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.

  • Published Mar 23, 2024 | 10:39 AMUpdated Mar 23, 2024 | 10:39 AM
ఖాకీ డ్రెస్సులో కీచకుడు.. మతిస్థిమితం లేని అమ్మాయిపై..

దేశంలో ఇటీవల నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు మహిళా సంఘాలు. చిన్నా, పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ చట్టాలు అమలు చేస్తూ ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు వస్తూనే ఉన్నాయి. చట్టాన్ని కాపాడుతూ.. మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో రెచ్చిపోయాడు. వివరాల్లోకి వెళితే..

పట్నాడ్ జిల్లా క్రోసూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ విధులు నిర్వహిస్తూ అందరికీ రక్షణగా ఉండాల్సిన కానిస్టేబుల్ రవి (52) ఓ మతిస్థిమితం లేని అమ్మాయిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆ అమ్మాయి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ రవికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పపడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల వల్ల పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతుందని పలువురు వ్యాఖ్యానించారు. వెంటనే కానిస్టేబుల్ రవిని సస్పెండ్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

క్రోసూరు లో ఈ ఘటన తీవ్ర దుమారాం రేపింది. మతి స్థిమితం లేని యువతి వద్దకు రవి అనే కానిస్టేబుల్ వెళ్లాడు. ఆ యువతి పరిస్థితి చూసి ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పపడ్డాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. వెంటనే ఆ యువతిని పక్కకు నెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు రవి. కానీ అప్పటికే కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకొని ఏం జరిగిందా అని చూడగా.. యువతి ఏడుస్తూ కనిపించింది. పరిస్థితి అర్థం చేసుకొని రవిని పట్టుకొని చితక్కోట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఇలాంటి అమానవీయ ఘటనకు పాల్పపడిన పోలీస్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş