డైరీ రంగంలో అగ్రగామి సహకార సంస్థ అయిన అమూల్ కార్యకలాపాలు ఈ రోజు బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అయ్యాయి. ఈ అంశంపై ఏపీ శాసన మండలిలో వాడీవేడీ చర్చ కూడా సాగింది. అమూల్ వల్ల లాభనష్టాలపై వివిధ పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థలోని డైరీలు మూతపడడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. హెరిటేజ్ డైరీ కోసం చిత్తూరు డైరీ మూతపడేటట్లు చేశారని కన్నబాబు విమర్శించారు. అమూల్ వల్ల […]
ఆంధ్రప్రదేశ్ మరో క్షీర విప్లవానికి కేంద్ర స్థానంగా మారబోతోంది. ప్రభుత్వ నిర్ణయం పాల వెల్లువకి దోహదం చేస్తోంది. అమూల్ వంటి దేశీయ అత్యున్నత సహకార సంస్థ తోడ్పాటుతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రైతాంగానికి ఊరట కల్పించేందుకు ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పాల సేకరణ ప్రారంభించిన గ్రామాల్లో పాల రైతులకు అదనపు ప్రయోజనం చేకూరుతుండడం దానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇన్నాళ్ళుగా రైతుల కష్టాన్ని కొల్లగొట్టిన హెరిటేజ్ వంటి ప్రైవేట్ డెయిరీలకు ప్రభుత్వ నిర్ణయంతో అనివార్యంగా అధిక […]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు జోడు చక్రాల వంటి వ్యవసాయం, పాడి రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన వైఎస్ జగన్ సర్కార్ ఆ దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వ్యవసాయంలో అన్నదాతలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న జగన్ సర్కార్.. తాజాగా పాడి పరిశ్రమపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, పాలక మండళ్ల అవినీతి కారణంగా నిర్వీర్యమైన సహకార డైరీలను తిరిగి […]
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవసరమైన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతులకు మేలు చేసేలా వైఎస్సార్ రైతు భరోసా, పంట బీమా, వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుతో సరసమైన ధరలకు విత్తనాలు, ఎరువులు, పరుగు మందులు సరఫరా చేస్తుండగా.. ఇకపై గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోసించే పాడి పరిశ్రమపై జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. రైతులకు వ్యవసాయం, పాడి రెండు […]
గతంలో సొంత డెయిరీ కోసం పలు సహకార డెయిరీలను చితికిపోయేలా చేసిన ఘనత చంద్రబాబుదనే అభిప్రాయం ఉంది. చిత్తూరు జిల్లాలో పలు డెయిరీలు మూతపడడం వెనుక ఆయన పాత్రపై ఆరోపణలున్నాయి. చివరకు అన్ని డెయిరీల పరిస్థితి ఎలా ఉన్నా, ఏటా హెరిటేజ్ లాభాలు గడించడంలో చంద్రబాబు ప్రభుత్వ తోడ్పాటు బాహాటంగా బయటపడింది. చివరకు ఇటీవల హెరిటేజ్ నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉత్పత్తులపై దర్యాప్తునకు కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ప్రస్తుతం జగన్ […]
ఇటీవలి దేశంలో మరోసారి చైనా వస్తువులను బహిష్కరించాలనే చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఇలాంటి చర్చే జరిగింది. కానీ మళ్లీ అది సద్దుమణిగింది. కానీ ఇటీవలి దేశంలో స్వదేశీ వస్తువు వాడాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో చైనా వస్తువుల బహిష్కరణ అంశం కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. వాస్తవానికి విదేశీ వస్తువుల వాడాకాన్ని తగ్గించాలని, దేశీయ వస్తువులను వాడాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. అందుకు ఒక్క చైనానే కాదు…అన్ని దేశాల వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించింది. కానీ […]