ఇప్పుడైతే డిజిటల్ మీడియా వచ్చి సినిమా ప్రచారం మారిపోయింది గానీ, ఒకప్పుడు అంతా నాటు, మోటు పద్ధతులే. తర్వాతి తరాల వాళ్లు నమ్మలేనంత ఆశ్చర్యంగా ప్రమోషన్ ఉండేది. తొలిరోజుల్లో జనాలను థియేటర్‌కి రప్పించడం అంత ఈజీ కాదు. కొత్త సినిమా వచ్చిందని, వాళ్లకి తెలియజేయడమే చాలా కష్టమైన పని. 1950కి ముందు ఊరంతా పోస్టర్లని ఊరేగించడమే కాకుండా, ఆ సినిమాలోని దృశ్యాలని వీధినాటకాలుగా ప్రదర్శించేవాళ్లు. భాగ్యరేఖలో రేలంగి పబ్లిసిటీ మేనేజర్‌గా ఉండి వీధుల్లో నాట్యం చేయిస్తూ ఉంటాడు. […]
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1962లో వచ్చిన సిరిసంపదలు సినిమాకి కె.రాఘవేంద్రరావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పి.పుల్లయ్య డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్‌లో ANR మారువేషం సీన్ ఉంటుంది. పిల్లిగడ్డం అతికించుకుని వస్తే హీరోయిస్ సావిత్రి గుర్తు పట్టదు. రాఘవేంద్రరావుకి అప్పటి నుంచే మారువేషాలపై ఇష్టం కలిగినట్టుంది. ఆయన సినిమాల్లో కూడా ఈ మారువేషాల క్లైమాక్స్‌లుంటాయి. (అడవి రాముడు, వేటగాడు) సిరిసంపదలు సినిమాకి అత్తారింటికి దారేదికి చిన్నపోలికలు ఉంటాయి. నాగయ్యకు ఒక కొడుకు, కూతురు. ఒక సందర్భంలో అల్లుడు […]