ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడిన మాటలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని, తెలంగాణా ముఖ్యమంత్రితో పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపినట్టు మీడియా ద్వారా తెలుసుకున్నానని త్వరలో షూటింగులు మొదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి అతి తక్కువ గ్యాప్ లోనే నిర్మాత సి కళ్యాణ్ బదులిస్తూ ఎవరి వల్ల పనులు జరుగుతాయో అలా ముందుకు వెళ్లడం […]