రెడ్డిరాజులు తొలి రాజధాని అద్దంకి కాగా మలి రాజధాని కొండవీడు. పాండ్యులు,విజయనగర బుక్కరాయలు నుంచి పెరుగుతున్న దాడులను తట్టుకునే శక్తి అద్దంకి కోటకు లేదని భావించటంతో ఆ ప్రాంతంలోనున్న వినుకొండ, బెల్లంకొండల కన్నా దృఢమైన, శత్రు దుర్బేధ్యమైన కోటను కట్టాలని తలచిన ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోట నిర్మాణం చేశాడు.ఆయన కొడుకు అనపోతారెడ్డి హయాంలో రెడ్డిరాజుల రాజధాని అద్దంకి నుంచి కొండవీడుకు మారింది. 1424లో రాచవేమారెడ్డి ఓటమితో కొండవీడు గజపతుల వశం అయ్యింది.అనంతరం శ్రీకృష్ణదేవరాయలు జయించేవరకు కొండవీడు గజపతుల […]