జనసేన తరపున మొన్నటి ఎన్నికల్లో రాజోలులో గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ అసలు పార్టీలోనే ఉన్నాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో జనసేన తరపున అక్కడక్కడ కొందరు పార్టీ నేతలు జనాలకు నిత్యావసరాలను పంచుతున్నారు. చివరకు రాజోలులో కూడా ఇంటిపల్లి ఆనందరాజ్ అనే చోటా నేత జనాలకు నిత్యావసరాలను పంపిణీ చేశాడు. ఆ ఫొటోను జనసేన పార్టీ ట్విట్టర్లో కూడా ప్రముఖంగా హైలైట్ […]