కరోనా వైరస్ సంక్షోభంలో రాజకీయాలు చేయకూడదని ఒకవైపు బుద్ధులు చెబుతునే మరోవైపు రాజకీయాలు చేయటం చంద్రబాబునాయుడుకే చెల్లింది. తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు చంద్రబాబు రాసిన లేఖలోనే రాజకీయమంతా బయటపడింది. పైగా తన లేఖలో ప్రస్తావించిన అంశాల్లో చాలా వరకూ అబద్ధాలనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్టు చేశారంటూ గవర్నర్ కు లేఖలో ఫిర్యాదు చేశాడు. అరెస్టు ఎందుకు చేశారంటే రైతుల సమస్యల మీద మాట్లాడేందుకు కలెక్టర్ […]