ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి […]
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ తన పసంగంలో రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పథకాలు ఏ స్థాయిలో ప్రజలకి అందాయి అనే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంచరించుకున్న రాజధానుల విషయంపై కూడా స్పందించారు. గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేద్రీకరణ అంశాన్నీ కీలకంగా ప్రస్థావిస్తూ. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా […]
అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. నల్లచొక్కాలు ధరించి సభలకు హాజరైన టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి అక్రమ అరెస్ట్లు ఆపాలని.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ ఆసాంతం […]