గత డెబ్భై రోజులుగా స్టార్ట్ కెమెరా యాక్షన్ రెడీ పదాలకు దూరంగా ఉన్న పరిశ్రమ వర్గాల్లో అతి త్వరలో సందడి మొదలుకాబోతోంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఇండస్ట్రీ పెద్దలు కలుసుకుని ఆ మేరకు కొంత హామీ అయితే తెచ్చుకోగలిగారు. జూన్ నుంచి పరిమిత సంఖ్యలో సభ్యులు ఉండేలా షూటింగులు ప్లాన్ చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని చెబుతూ త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు. సినిమాటోగ్రఫీ […]
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు హాజరు కాగా రాబోయే రోజుల గురించి చర్చలు జరిగాయి. అక్కినేని నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, త్రివిక్రమ్, కొరటాల శివ, చినబాబు, దిల్ రాజు, సి కళ్యాణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. షూటింగులు ఆగిపోవడం వల్ల 14 వేల కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందనే దాని గురించి చిరంజీవి ప్రస్తావించగా గవర్నమెంట్ తరఫున చెప్పబట్టబోయే […]
మూవీ లవర్స్ కు ఇంకొన్ని బ్యాడ్ డేస్ తప్పేలా లేవు. వచ్చే నెల నుంచి థియేటర్ గేట్లు తెరుచుకుంటాయేమోనని ఆశపడుతున్న ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చేలా సర్కారు నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కొంత సానుకూలతతో ఉన్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం జనసాంద్రత ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి నగరాల్లో రిస్క్ తీసుకునే ఉద్దేశంతో లేనట్టుగా తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే ఏపిలో హాళ్లు తెరుచుకున్నా లాభం ఉండదు. ఇటీవలే ఓ మీడియా […]
లాక్ డౌన్ ఇంకా పూర్తిగా ఎత్తివేయకపోయినా మెల్లగా ఒక్కో రంగానికి సంబంధించి ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడం షురూ చేశాయి. ముందుగా ప్రజా రవాణాను మొదలుపెట్టబోతున్నారు. కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ మొత్తానికైతే తొలి అడుగు పడబోతోంది. ఇక థియేటర్ల విషయానికి వస్తే ఐడ్రీం చాలా వారాల క్రితమే చెప్పినట్టు సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఇచ్చి టికెట్ల అమ్మకాలు చేసే దిశగా ఇప్పటికే యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ కాంప్లెక్స్ […]
ఇవాళ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి అధ్యక్షతన ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. లాక్ డౌన్ టైంలో మొదటిసారి చేసిన సమావేశం కావడంతో ఏవైనా కీలక నిర్ణయాలు ఉంటాయనే ఉద్దేశంతో మీడియా ప్రతినిధులు కూడా తరలి వచ్చారు. అయితే పూర్తి స్థాయి స్పష్టతనివ్వకుండానే ముగించేయడం కొంత అయోమయాన్ని మిగిల్చింది. పరిస్థితులను బట్టి జూన్ లేదా జులై నుంచి షూటింగులకు అనుమతి ఇచ్చేలా చర్యలు చేపడతామని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఇందులో […]