సరిహద్దుల ప్రాంతంలో రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే చైనా సైనిక చర్యకు దిగుతోందని అందరికీ అర్ధమైపోతోంది. తాజగా జమ్మూ-కాశ్మీర్ లోయ లడ్డాఖ్ లోని గాల్వాన్, పాంగాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల భారత్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేసింది. పై ప్రాంతంలో సుమారు 10 వేల డ్రాగన్ సైనికులు తిష్టవేశారు. దాంతో 35 కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించేసిందా అనే టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ మూడో వారం నుండి పై ప్రాంతాల్లోని అన్నీ వైపుల నుండి […]
జమ్మూ కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 16న కాశ్మీర్‌లోని కుల్గాంలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ రియాజ్ నైకూను తుదముట్టించిన సంగతి తెలిసిందే. నేటి తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పులలో హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన టాప్ కమాండర్‌తో పాటు మరో ఉగ్రవాది మరణించాడు. తాజాగా శ్రీనగర్‌లోని నవకడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో భద్రతా […]