ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలవైపు ప్రజలు చూస్తుంటారు. ఇక్కడ కేంద్రమైనా, రాష్ట్రమైనా సరే. అవి చేపట్టే చర్యలు సామాన్య ప్రజానీకంలో తీవ్ర చర్చకునిలుస్తాయి. కరోనా లాంటి మహమ్మారులు దాడితో అతలాకుతలం అవుతున్నప్పుడు భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడే ప్రజానీకం ప్రతి అంశంలోనూ తీవ్రంగానే ప్రతిస్పందిస్తుంది. ఒక రోజు జనతాకర్ఫూకు పిలుపునిస్తే ఇళ్ళ నుంచి బైటకు రాకుండా విజయవంతం చేసిన ప్రజలు, 21 రోజుల లాక్డౌన్ మొదటి వారం దాటగానే స్వల్పంగా ప్రారంభమైన ఉల్లంఘనలు కొన్ని […]