కేంద్ర హోం శాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పారు. ఏఎన్ఐ వార్తా చానెల్‌కు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఆ లేఖ తాను రాయలేదని తెలిపారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ నిన్న బుధవారం రమేష్‌కుమార్ లేఖ రాశారంటూ ప్రచారం జరిగింది. ఓ లేఖ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రచారమయ్యాయి. వార్త ఛానెళ్లలో చర్చలు జరిగాయి. […]
ఎన్నికలు వాయిదా అంశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోనిదంటూ సుప్రిం కోర్టు తీర్పునివ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా బ్రేక్ పడింది. కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై సుప్రింలో సానుకూల తీర్పు వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. అయితే ఎన్నికల కోడ్ ఎత్తివేయడం ఊరటనిచ్చింది. మేలో మళ్లీ ప్రారంభం.. ఆరు వారాలు అంటే.. ఏప్రిల్ నెలాఖరు వరకూ స్థానిక సంస్థల […]
ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ సర్కార్ ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కరోనాను కారణంగా చూపుతూ ఏపీలో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేయగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రింలో నిన్న సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా సుప్రింలో ఈ రోజు మంగళవారం […]
కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపుతట్టింది. లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్దాఖలు చేసింది. పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అయితే ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఊరట కలిగించే నిర్ణయం రాలేదు. పైగా నిరుత్సాహం వచ్చేలా విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు విచారణ, నిర్ణయం ఆశగా ఎదురుచూసిన […]
ఆంధప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, పత్రిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారగా.. తాజాగా ఎన్నికల వాయిదా అంశం సవాళ్లకు దారితీస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి సవాళ్లు వస్తుంటాయి. కానీ చిత్రంగా ఏపీలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి సవాళ్లు వెళుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని, పోలీసులను ఉపయోగిస్తూ తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అందుకే భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు […]