విశాఖ సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురం లో విషవాయువు లీకై 12 మంది మరణానికి కారణమైన ఎల్జి పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషవాయువు లీకైన ఘటనలో చనిపోయినవారి మృతదేహాలను ఈరోజు కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి ఆర్ఆర్ వెంకటాపురం కి తీసుకు వచ్చారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తులైన గ్రామ ప్రజలు మృతదేహాలను కంపెనీ గేటు ముందు ఉంచి ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కంపెనీలో కి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉచ్చు బిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, ఏకగ్రీవాలపై అభ్యంతరకర రీతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. దాంతో పాటు తన ప్రాణానికి హాని ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. అయితే లేఖ పై అప్పట్లో కమిషనర్ గా […]
ఇప్పటి వరకూ రెండు నుండి మూడు రోజులు పడుతున్న కరోనా అనుమానితుల టెస్ట్ రిపోర్ట్స్ నేటి నుండి అత్యంత వేగంగా పది నిమిషాల్లో రిపోర్ట్స్ రానున్నాయి . ఇందుకోసం దక్షిణ కొరియా నుండి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ప్రత్యేక ఛార్టర్ ఫ్లయిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది . కాగా సీఎం వైఎస్ జగన్ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ టెస్ట్ కిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు . ఈ ర్యాపిడ్ […]
విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని ఇంటిలో, ప్రభుత్వ క్వారంటైన్ లో కట్టడి చెయ్యడం కష్టతరం కావడంతో రాష్ట్ర పోలీసులు చైనా తరహా లో సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రవాసాంధ్రులందరిని వారి పూర్తి వివరాలతో జియో ట్యాగింగ్ కు అనుసంధానం చెయ్యడం ద్వారా నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈమేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులైన పోలీసు అధికారుల బృందం ఒక కొత్త హౌస్ క్వారంటైన్ యాప్ ని రూపొందించింది. […]