ఒకనాడు తాను ముఖ్యమంత్రిగా కన్నా సీఈవో అని చెప్పుకోవడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో వివిధ కార్పోరేట్ కంపెనీలకు అన్నీ అడ్డంకులు తొలగించేలా మార్పులు తీసుకొచ్చారు. చివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో నిబంధనలు సడలించి వివిధ ప్రమాకర పరిశ్రమలకు కూడా అనుమతిచ్చిన ఘనత దక్కించుకున్నారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి పాలకపక్షాన్ని నిందించడానికి సిద్ధపడుతున్నారు. గురివిందను తలపించేలా ఉన్న చంద్రబాబు తీరు మీద ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆయన చేస్తున్న […]