మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమర్థతపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… పార్టీ నడపడం చంద్రబాబు తనయుడుకు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు ఉన్నారు. నిన్నమొన్నటి వరకు చిన్నబాబుకు విపరీతమైన కవరేజ్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి క్రమంగా ఆయనకు ప్రాధాన్యతను తగ్గిస్తోంది. తాజాగా నిన్న జరిగిన విశాఖ ఘటనపై టిడిపి లోని కింది స్థాయి నేతలు ప్రకటనలు కూడా ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక చినబాబు సంతాప ప్రకటనకు మాత్రం చోటివ్వలేదు. […]
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్ధపై తెలుగుదేశంపార్టీ నేతలు బురద చల్లేస్తున్నారు. ఈ వ్యవస్ధ వల్ల జగన్ కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అన్న ఆందోళనతో మొదటి నుండి టిడిపి ఈ వ్యవస్ధను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ వాలంటీర్లే నాటుసారా తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. కరోనా సంక్షోభం నేపధ్యంలో వాలంటీర్ల పనితీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. […]
అబద్ధాలు ఆడితే అతికినట్లుండాలి అంటారు. అబద్ధాలు ఆడటం అనేది కూడా ఒక కళ. ఎవరో చంద్రబాబు లాంటి వారికి తప్ప ఆ కళ అందరికీ పెద్దగా అబ్బదు. అయితే తమ అధినేత కళను తాము కూడా వంటబట్టించుకోవాలనే లక్ష్యంతో టిడిపి నాయకులు బాబు బాటలో పయనిస్తూ బొక్క బోర్లా పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన వెంటనే విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉండే టిడిపి నేతలు ఈరోజు కూడా తమ గళాలకు పదును పెట్టారు. […]