కరోనా లాక్డౌన్ తో ఆగిపోయిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు త్వరలో పునః ప్రారంభమైయ్యే అవకాశముందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలో కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వర్షకాల పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఒకపక్క దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తుంది. మరోవైపు జూన్ చివరి వారంలోనైనా, జూలై మొదటి వారంలోనైనా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాలకు ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా లేవు. […]