iDreamPost

ఆస్ట్రేలియా పొగరు అణచడానికి సరైనోడ్ని దించుతున్న రోహిత్.. ఇక దబిడిదిబిడే!

  • Published Jun 24, 2024 | 3:03 PMUpdated Jun 24, 2024 | 3:03 PM

టీ20 వరల్డ్ కప్​లో అసలైన పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పటివరకు చిన్నా చితకా జట్లతో ఆడుతూ వచ్చిన రోహిత్ సేన.. ఇప్పుడు సరైన ప్రత్యర్థితో తలపడనుంది. ఆస్ట్రేలియాతో సూపర్ పోరులో తాడోపేడో తేల్చుకోనుంది.

టీ20 వరల్డ్ కప్​లో అసలైన పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పటివరకు చిన్నా చితకా జట్లతో ఆడుతూ వచ్చిన రోహిత్ సేన.. ఇప్పుడు సరైన ప్రత్యర్థితో తలపడనుంది. ఆస్ట్రేలియాతో సూపర్ పోరులో తాడోపేడో తేల్చుకోనుంది.

  • Published Jun 24, 2024 | 3:03 PMUpdated Jun 24, 2024 | 3:03 PM
ఆస్ట్రేలియా పొగరు అణచడానికి సరైనోడ్ని దించుతున్న రోహిత్.. ఇక దబిడిదిబిడే!

టీ20 వరల్డ్ కప్​లో అసలైన పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఇప్పటివరకు చిన్నా చితకా జట్లతో ఆడుతూ వచ్చిన రోహిత్ సేన.. ఇప్పుడు సరైన ప్రత్యర్థితో తలపడనుంది. ఆస్ట్రేలియాతో సూపర్ పోరులో తాడోపేడో తేల్చుకోనుంది. ఇప్పటికే సూపర్-8లో రెండు వరుస విజయాలతో గ్రూప్ టాపర్​గా ఉంది భారత్. మొదటి మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. సెకండ్ గేమ్​లో బంగ్లాదేశ్​ను మట్టికరిపించింది. అయితే రెండు మ్యాచుల్లో నెగ్గిన మన జట్టుకు సెమీస్ బెర్త్ అఫీషియల్​గా కన్ఫర్మ్ కాలేదు. ఇవాళ ఆసీస్​ను ఓడిస్తే నేరుగా సెమీస్​కు చేరుకోవచ్చు. ఒకవేళ ఓడినా స్మాల్ మార్జిన్​తో ఓడాలి. భారీ తేడాతో ఓడిపోతే క్వాలిఫికేషన్ కష్టమయ్యే ప్రమాదం ఉంది. అటు కంగారూలు గెలిస్తే తప్ప సెమీస్​కు వెళ్లలేని సిచ్యువేషన్. ఆ రకంగా రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.

భారత్-ఆసీస్​కే కాదు.. ఆఫ్ఘానిస్థాన్​కు కూడా ఇది క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే ఇవాళ గనుక కంగారూ జట్టు ఓడిపోతే ఆఫ్ఘాన్ సెమీస్​కు చేరుతుంది. అందుకే ఈ మ్యాచ్​ మీద అందరి ఫోకస్ నెలకొంది. భారత్​ ముందు సెమీస్ క్వాలిఫికేషన్​తో పాటు మరో సవాల్ కూడా ఉంది. అదే రివేంజ్. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్​లో ఆసీస్ చేతిలో ఓడి కప్పును చేజార్చుకుంది టీమిండియా. కాబట్టి ప్రతీకారానికి ఇదే సరైన సమయం. ఈ మ్యాచ్​లో ఓడిస్తే సెమీస్​కు ముందే కంగారూల కథ ముగుస్తుంది. అందుకే పకడ్బందీగా సన్నాహకాలు చేస్తోంది రోహిత్ సేన. గెలుపు కోసం బలమైన వ్యూహాలు పన్నుతోంది టీమ్ మేనేజ్​మెంట్. ఈ క్రమంలోనే ఆసీస్ పొగరు అణచడానికి ప్లేయింగ్ ఎలెవన్​లోకి అసలైనోడ్ని దించుతున్నారని తెలుస్తోంది. స్పీడ్ గన్​ మహ్మద్ సిరాజ్​ను ఆడించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

బంగ్లాదేశ్​ మీద ఆడిన టీమ్​నే ఆసీస్​ మ్యాచ్​కూ కంటిన్యూ చేయనున్నారని తెలిసింది. బ్యాటింగ్, బౌలింగ్​లో దాదాపుగా ఎలాంటి ఛేంజెస్ ఉండవట. అయితే ఒక్క మార్పు మాత్రం ఖాయమని సమాచారం. స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ ప్లేస్​లో సిరాజ్ టీమ్​లోకి ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని టాక్ నడుస్తోంది. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న సెయింట్ లూసియా మైదానం వికెట్, కండీషన్స్​కు తగ్గట్లు సిరాజ్ ఆయుధాన్ని వాడాలని ఫిక్స్ అయ్యాడట కెప్టెన్ రోహిత్. ఈ మధ్య కాలంలో అంతగా ఫామ్​లో లేకపోయినా తనదైన రోజున అతడు ఏమైనా చేయగలడు. పిచ్​తో పాటు అక్కడ భారీగా వీచే గాలిని వాడుకొని సిరాజ్ తన పేస్​తో మ్యాజిక్ చేస్తాడని మేనేజ్​మెంట్ భావిస్తోందట. బిగ్ మ్యాచెస్​లో ఆడిన అనుభవం, కసిగా స్పెల్స్ వేసే సత్తా ఉండటం, కండీషన్స్ అనుకూలిస్తే రెచ్చిపోయి అపోజిషన్ టీమ్స్​ను ఇరుకున పెట్టడం తెలుసు కాబట్టే అక్షర్​ను కాదని సిరాజ్​ వైపు హిట్​మ్యాన్​ మొగ్గుచూపాడని తెలుస్తోంది. మరి.. భారత ప్లేయింగ్ ఎలెవన్​లో సిరాజ్ ఉండాలని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి