iDreamPost

IND vs USA మ్యాచ్.. అండర్సన్ బంతికి బిత్తరపోయిన SKY! వీడియో వైరల్..

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కోరె అండర్సన్ బౌలింగ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన విన్యాసం ఒకటి వైరల్ గా మారింది. అండర్సన్ బంతిని ఊహించని స్కై.. బిత్తరపోయాడు. ఆ వివరాలు..

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో కోరె అండర్సన్ బౌలింగ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన విన్యాసం ఒకటి వైరల్ గా మారింది. అండర్సన్ బంతిని ఊహించని స్కై.. బిత్తరపోయాడు. ఆ వివరాలు..

IND vs USA మ్యాచ్.. అండర్సన్ బంతికి బిత్తరపోయిన SKY! వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో సూపర్ 8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి కోరె అండర్సన్ బౌలింగ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన విన్యాసం ఒకటి. అండర్సన్ బంతిని ఊహించని స్కై.. బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ సూపర్ ఫిఫ్టీతో అలరించాడు. ఈ మ్యాచ్ లో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సూర్యకుమార్-శివమ్ దూబే విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లో 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్.. 12వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.

ఈ ఓవర్లో కోరె అండర్సన్ వేసిన 4వ బంతి లో లెవల్లో వచ్చింది. కానీ బంతి బౌన్స్ అవుతుందని భావించిన సూర్య అంచనా తప్పింది. దాంతో డిఫెన్స్ ఆడే క్రమంలో క్రీజ్ లోనే ఊహించని విధంగా కింద పడ్డాడు. అయితే.. ఆ తర్వాత ఆసనం వేసినట్లుగా కూర్చుని అందరిని నవ్వించాడు. బాల్ ను అంచనావేయడంలో విఫలం అయిన సూర్య.. బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ మ్యాచ్ లో స్కై తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. ఎప్పుడు బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించే స్కై.. ఈ మ్యాచ్ లో పరిస్థితులకు అనుగుణంగా ఆడి.. జట్టుకు కీలక విజయాన్ని అందించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి