iDreamPost

బట్లర్ భారీ సిక్సర్.. కొడితే సోలార్ ప్యానల్ బద్దలైంది! వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్.. సూపర్ 8లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు జోస్ బట్లర్. ఇక ఈ మ్యాచ్ లో బట్లర్ కొట్టిన ఓ భారీ సిక్స్ సోలార్ ప్యానల్ ను బద్దలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్.. సూపర్ 8లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు జోస్ బట్లర్. ఇక ఈ మ్యాచ్ లో బట్లర్ కొట్టిన ఓ భారీ సిక్స్ సోలార్ ప్యానల్ ను బద్దలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

బట్లర్ భారీ సిక్సర్.. కొడితే సోలార్ ప్యానల్ బద్దలైంది! వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ 2024.. సూపర్ 8లో భాగంగా ఇంగ్లండ్-అమెరికా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లండ్. దాంతో గ్రూప్ 2 నుంచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో పెను విధ్వంసం సృష్టించాడు కెప్టెన్ జోస్ బట్లర్. 38 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా.. బట్లర్ కొట్టిన ఓ భారీ సిక్సర్ తో స్టేడియం రూఫ్ పైన ఉన్న సోలార్ ప్యానల్ బద్దలైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. యూఎస్ఏ బౌలర్లపై సిక్సుల వర్షం కురిపిస్తూ.. జట్టుకు అఖండ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో హర్మీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ఓవర్లో వరుసగా 5 సిక్సులు బాది.. 32 రన్స్ పిండుకున్నారు. ఇక ఈ 5 సిక్సుల్లో ఓ భారీ సిక్సర్ దెబ్బకి స్టేడియం పైన ఉన్న సోలార్ ప్యానల్ బద్దలైంది. 104 మీటర్ల ఈ భారీ సిక్సర్ కు సోలార్ ప్యానల్ బ్రేక్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమెరికా 115 పరుగులకే కుప్పకూలింది. హ్యాట్రిక్ హీరో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లతో చెలరేగాడు. నితీశ్ కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం 116 పరుగుల ఈజీ టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా దంచికొట్టింది. బట్లర్ 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఫిలిప్ సాల్ట్ 25 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. మరి బట్లర్ కొట్టిన సిక్సర్ దెబ్బకు సోలార్ ప్యానెల్ బద్దలు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి