iDreamPost

రాజ్యసభకు సుధామూర్తి.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ఇన్పోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రచయిత్రిగా, సమాజ సేవకురాలిగా, వక్తగా అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఆమె..

ఇన్పోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రచయిత్రిగా, సమాజ సేవకురాలిగా, వక్తగా అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఆమె..

రాజ్యసభకు సుధామూర్తి.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్పోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు అనేక రంగాల్లో సేవలందిస్తూ స్ఫూర్తి దాయకంగా నిలిచారు. దేశానికి ఆమె చేసిన సేవలకు గానూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే మూడవ అత్యంత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. ఆమె గొప్ప రచయిత్రి మాత్రమే కాదూ వక్త కూడా. తన స్పీచులతో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన సుధా మూర్తి ఇప్పుడు రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ఈ విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ సందర్భంగా సుధామూర్తికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సుధామూర్తిని రాజ్యసభకు భారత రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్య సభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ’ అంటూ ట్వీట్ చేశారు. సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1950లో ఆగస్టు 19న కర్ణాటలకోని షిగ్గావ్ లో జన్మించిన ఆమె.. విద్యా భ్యాసం అంతా కర్ణాటకలో సాగింది.

టాటా ఇంజనీరింగ్, లోకో మోటివ్ కంపెనీ (టెల్కో) తొలి మహిళా ఎంప్లాయిగా నిలిచారు సుధా మూర్తి. నారాయణ మూర్తిని వివాహం చేసుకున్న తర్వాత.. వీరి ఇన్ఫోసిస్ స్థాపించారు. గతంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆమె ఇన్ఫోసిస్ ఎదుగుదలలో ఆమె విశేషమైన కృషి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు. వీరిలో అక్షతా మూర్తి..ప్రస్తుత బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ భార్య అన్న సంగతి విదితమే. ఆమె ఇన్పోసిస్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోను స్థాపించి.. ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం వంటి సమస్యలపై పనిచేస్తుంది. దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు సుధామూర్తి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కూడా నిధులను సమకూర్చింది సంస్థ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి