iDreamPost

Kalki 2898 AD: బుర్ర బద్దలయ్యే న్యూస్.. ‘కల్కి’లో ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ క్యామియో రోల్?

కల్కి మూవీకి సంబంధించి బుర్ర బద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? కల్కిలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో రోల్ లో కనిపించనున్నారట. ఆ దర్శకులు ఎవరంటే?

కల్కి మూవీకి సంబంధించి బుర్ర బద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? కల్కిలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో రోల్ లో కనిపించనున్నారట. ఆ దర్శకులు ఎవరంటే?

Kalki 2898 AD: బుర్ర బద్దలయ్యే న్యూస్.. ‘కల్కి’లో ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ క్యామియో రోల్?

‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. డార్లింగ్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ లాంటి భారీ క్యాస్టింగ్ తో వస్తోన్న చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ నేడు (జూన్ 10న) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి బుర్ర బద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? కల్కిలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో రోల్ లో కనిపించనున్నారట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ‘2898 ఏడీ’ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో తెరకెక్కిన కల్కి.. ఓవర్సీస్ లో ఓ రోజు ముందుగానే విడుదల కానుంది. దాంతో ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యి.. జోరుమీదున్నాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్ ను నేడు(సోమవారం) సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీని షేక్ చేసే ఓ న్యూస్ వైరల్ గా మారింది. కల్కి మూవీలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో రోల్స్ చేస్తున్నారట. వాళ్లు ఎవరంటే?

Kalki

ముగ్గురు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కల్కి మూవీలో అతిథి పాత్రలో మెరవనున్నారని పరిశ్రమను ఓ వార్త షేక్ చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, అనుదీప్.. ఈ ముగ్గుర కల్కిలో క్యామియో రోల్స్ లో నటించనున్నారని టాక్. రాజమౌళికి ప్రభాస్ ఎలాగో దగ్గర కాబట్టి ఆయన నటించే ఛాన్స్ లు ఎక్కువే. అలాగే అనుదీప్ నాగ్ అశ్విన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఆర్జీవీకి అశ్వనీదత్ తో ఉన్న బాండింగ్ కారణంగా వీరు ముగ్గురు ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. అందుకే ఈ వార్తలను కొట్టిపారేయలేం. ఇక వీరితో పాటుగా విజయ్ దేవకొండ, మృణాల్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో భారీ తారాగాణంతో వస్తున్న కల్కి ఏ రేంజ్ కలెక్షన్లు సాధించి.. రికార్డులు బద్దలు కొడుతుందో వేచిచూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి