Tirupathi Rao
SRK Insulted Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై అక్కసు వెళ్లగక్కిన షారుక్ ఖాన్. అంబానీ వేడుకల్లో నాటు నాటు పాట కోసం స్టేజ్ మీదకు పిలుస్తూ నోటి దురుసు వ్యాఖ్యలు..
SRK Insulted Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై అక్కసు వెళ్లగక్కిన షారుక్ ఖాన్. అంబానీ వేడుకల్లో నాటు నాటు పాట కోసం స్టేజ్ మీదకు పిలుస్తూ నోటి దురుసు వ్యాఖ్యలు..
Tirupathi Rao
ఇండియన్ సినిమా.. గతంలో వరల్డ్ వైడ్ గా ఈ పేరు వినపడగానే బాలీవుడ్ అనేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని.. సౌత్ ఇండస్ట్రీ అనే పేరు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా పాన్ వరల్డ్ కి రీజనల్ సినిమా చేరింది. ఈ ఘనత దక్కడం వెనుక ఎంతోమంది డైరెక్టర్స్, స్టార్స్, టెక్నీషియన్స్ కృషి ఉంది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని బాలీవుడ్ కలలో కూడా అనుకుని ఉండదు. అలాంటి ఒకరోజు వచ్చింది. సౌత్ ఇండస్ట్రీ ముందు బాలీవుడ్ తలవంచక తప్పలేదు. కానీ, ఆ అక్కసును ప్రతి అంశంలో, అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకల్లో షారుక్ ఖాన్ చూపించినట్లు..
టాలీవుడ్ ఇండస్ట్రీ.. సినిమా హద్దులను చెరిపేస్తూ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కల్కి, పుష్ప 2, మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్స్ వంటి చిత్రాలు పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, స్టార్స్ అందరూ పాన్ ఇండియా లెవల్లో తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ కి కూడా హిట్టు దక్కాలి అంటే సౌత్ నుంచి తారలో.. డైరెక్టర్లో వెళ్తే గానీ పనవ్వట్లేదు. అయితే ఇన్నాళ్లు ఇండియన్ సినిమాని ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం దక్కినప్పుడల్లా తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. మన సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం, సందీప్ వంగా లాంటి వాళ్ల చిత్రాలను తొక్కేయాలని చూడటం.. వంటివి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.
లోపల మండుతున్నా.. పైకి మాత్రం అతి కష్టం మీద చప్పట్లు కొడుతూ ఉంటారు. అయితే వారికి ఛాన్స్ దక్కినప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ మీద వారికి ఉన్న అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకల్లో షారుక్ ఖాన్ చేసిన పని అలాగే అనిపించింది. అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో.. అక్కడ స్టేజ్ మీద ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు సాంగ్ ప్లే చేశారు. అంబానీ కుటుంబం, ఖాన్ లు అంతా డాన్స్ చేస్తున్నారు. నీతా అంబానీ వేడుకలో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. షారుక్ ఖాన్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావ్ అంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత తమిళ్ మాట్లాడుతున్నట్లు ఇడ్లీ సాంబార్ తినేసి.. కూర్చున్నావా? బెండ్ ఇడ్లీ.. రామ్ చరణ్ ఎక్కడున్నావ్? అంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఖాన్ లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు.
షారుక్ ఖాన్ చేసింది సరదా స్పీచ్ అయినా.. ప్రపంచస్థాయి అతిథులు హాజరైన ఒక కార్యక్రమంలో.. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని ఆహ్వానించే తీరు మాత్రం అది కాదు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటికీ బాలీవుడ్ తారలకు టాలీవుడ్ మీద, సౌత్ సినిమా మీద ఉన్న చిన్నచూపునకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది. ఈ ఘటన జరగిన తర్వాత తాను ఆ వేడుక నుంచి వెళ్లిపోయానంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని స్టేజ్ మీదకు పిలిచే విధానం అయితే అది కాదు అంటూ స్పష్టం చేసింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ అన్నా, సౌత్ లో ఉండే టాలెంట్ అన్నా బాలీవుడ్ వాళ్లకు ఎప్పుడూ చిన్నచూపే అంటూ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పింది. మరి.. రామ్ చరణ్ ని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ షారుక్ ఖాన్ ఇడ్లీ సాంబారు పదాలు వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.