iDreamPost

చరణ్‌ని ఇన్సల్ట్ చేసిందే కాకుండా కవర్ చేసే ప్రయత్నాలు

SRK, RC Controversy: చరణ్ ని ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ పిలిచి అవమానించడమే కాకుండా దాన్ని షారుక్ ఫ్యాన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి బాలీవుడ్ కి దక్షిణాది సినీ పరిశ్రమ అన్నా, దక్షిణాది నటులు అన్నా చిన్న చూపే.

SRK, RC Controversy: చరణ్ ని ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ పిలిచి అవమానించడమే కాకుండా దాన్ని షారుక్ ఫ్యాన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి బాలీవుడ్ కి దక్షిణాది సినీ పరిశ్రమ అన్నా, దక్షిణాది నటులు అన్నా చిన్న చూపే.

చరణ్‌ని ఇన్సల్ట్ చేసిందే కాకుండా కవర్ చేసే ప్రయత్నాలు

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. యాక్టింగ్ రాదు అన్న నోటితోనే యాక్టింగ్ కా బాప్ అని అనిపించుకున్నారు. అలాంటి రామ్ చరణ్ ని షారుక్ ఖాన్ అవమానించారు. ఇడ్లీ, వడ అంటూ రామ్ చరణ్ ని స్టేజ్ పైకి పిలవడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు దక్షిణాది హీరోలైన రామ్ చరణ్, రజినీకాంత్ హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేశారు.

ఇక్కడ వరకూ బానే ఉన్నా రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధిస్తూ స్టేజ్ పైకి పిలవడమే ఇప్పుడు బాలీవుడ్ బలుపుకి కారణమని అనిపిస్తుంది. మొదటి నుంచి బాలీవుడ్ హీరోలకి సౌత్ అన్నా, సౌత్ హీరోలన్నా చిన్న చూపు. బలుపు మాటలతో కించపరుస్తూ ఉంటారు. ఆ మధ్య తమిళ నటుడు మాధవన్ ని కూడా అవమానించే ప్రయత్నం చేశారు. కానీ మాధవన్ వారిని ఒకాట ఆడుకున్నారు. సౌత్ ని, నార్త్ ని వాళ్ళు ఎప్పుడూ వేరు చేసి చూస్తారు. బాలీవుడ్ అంటేనే ఇండియన్ సినిమా అనే స్థాయిలో వారి బలుపు ఉంటుంది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుల పుణ్యమా అని తెలుగు సినిమా స్థాయి ఏంటో తెలిసింది. అయినప్పటికీ తెలుగు హీరోలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు ఈ సో కాల్డ్ బాలీవుడ్ హీరోలు.

అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అంటూ పిలవడం ఏంటి? ఇక్కడ సౌత్ వాళ్ళు తినే ఫుడ్ ని కూడా ఇన్సల్ట్ చేసినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఇడ్లీ, సాంబార్ గయ్ కమ్ హియర్’ అంటూ పిలవడాన్ని కూడా మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే షారుక్ చేసిన కామెంట్స్ ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటున్నారు. ఒకరకంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షారుక్ ఖాన్ నటించిన ‘వన్ 2 కా 4’ అనే సినిమాలో డైలాగ్ ని షేర్ చేస్తూ అవమానించలేదు.. ఇంకా చరణ్ ని రజినీకాంత్ తో పోల్చాడు అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాలో రజినీకాంత్ ని ఎలివేట్ చేసేలా షారుక్ డైలాగ్ ఉందని.. ఇప్పుడు అదే కాంటెక్స్ట్ తో షారుక్ రామ్ చరణ్ ని పిలిచాడని ఫ్యాన్స్ అంటున్నారు.

రామ్ చరణ్ ని షారుక్ ఖాన్ రజినీకాంత్ తో పోల్చాడని అంటున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అవమానంగా ఫీలవుతున్నారు. ఒక గ్లోబల్ స్టార్ ని వేదిక మీదకి ఇలా ఎవరూ ఆహ్వానించరని.. హుందాగా వ్యవహరించాలని అంటున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ ని అవమానించిందే కాకుండా కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి