iDreamPost

Gulbadin Naib: చీటింగ్ చేయడంపై స్పందించిన నైబ్! ఏమన్నాడంటే?

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చీటింగ్ చేశాడన్న అంశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై తాజాగా స్పందించాడు నైబ్. అతడు ఏమన్నాడంటే?

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చీటింగ్ చేశాడన్న అంశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై తాజాగా స్పందించాడు నైబ్. అతడు ఏమన్నాడంటే?

Gulbadin Naib: చీటింగ్ చేయడంపై స్పందించిన నైబ్! ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్.. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 పరుగుల స్వల్ప తేడాతో థ్రిలింగ్ విక్టరీని సాధించింది ఆఫ్గానిస్తాన్. దాంతో తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు దూసుకొచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ చీటింగ్ చేశాడన్న అంశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై ఐసీసీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన ఆస్కార్ లెవల్ యాక్టింగ్ పై నైబ్ కాస్త విచిత్రంగా స్పందించాడు. ఈ ఘటనపై నైబ్ ఏమన్నాడంటే?

ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో చిరు జల్లులు ప్రారంభం అయ్యాయి. ఈ సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులతో ఆఫ్గాన్ ముందంజలో ఉంది. దాంతో సమయాన్ని వృథా చేయాలని ఆఫ్గాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ సైగల ద్వారా సూచించాడు. ఆ సైగలను పసిగట్టిన గుల్బాదిన్ నైబ్.. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఫిజియోలు గ్రౌండ్ లోకి రావడం, వర్షం పెద్దది కావడం, ఆటను నిలిపివేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

కాగా.. గుల్బాదిన్ నైబ్ ఆస్కార్ లెవల్ యాక్టింగ్ పై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటుగా మరికొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. తొడ కండరాల గాయంతో వికెట్ తీసిన తొలి బౌలర్ గా నైబ్ నిలుస్తాడని మైకేల్ వాన్ సెటైర్లు పేల్చాడు. ఇక తనకు ప్రథమ చికిత్స చేసిన ఫిజియో వివరాలు చెప్పాలని, తన మోకాళ్ల నొప్పులకు అతడి వద్ద చికిత్స తీసుకుంటానని ప్రముఖ కామెంటేటర్ సైమాన్ డౌల్ అన్నాడు. ఈ క్రమంలో అశ్విన్ రెడ్ కార్పెట్ పరచాలి అన్న ట్విట్ పై గుల్బాదిన్ స్పందించాడు. “కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం గా నా పరిస్థితి ఉంది” అని అశ్విన్ కు రిప్లై ఇచ్చాడు. బహుశా ఈ విషయం గురించి చెప్పడానికి అతడు ఇష్టపడటం లేనట్లు తెలుస్తోంది. నైబ్ తప్పు చేశాడు కాబట్టే ఇలా కామెంట్ చేశాడని కొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి గుల్బాదిన్ నైబ్ ఆస్కార్ లెవల్ యాక్టింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి