iDreamPost

దేశం కోసం నాన్న కన్నుమూత! రోజూ కొడుకు చేస్తున్న పని తెలిస్తే కన్నీరు ఆగవు!

Colonel Manpreet Singh: ఊహ తెలియని పిల్లలకు అమ్మానాన్నలపై ఉండే ప్రేమ వర్ణించలేము. ఇక ఏదైనా విషాదం జరిగినప్పుడు..ఆ ఘటన తెలియకు పిల్లలు చేసే ప్రవర్తన చూస్తే గుండెల్ని పిడేసినట్లు అవుతుంది.

Colonel Manpreet Singh: ఊహ తెలియని పిల్లలకు అమ్మానాన్నలపై ఉండే ప్రేమ వర్ణించలేము. ఇక ఏదైనా విషాదం జరిగినప్పుడు..ఆ ఘటన తెలియకు పిల్లలు చేసే ప్రవర్తన చూస్తే గుండెల్ని పిడేసినట్లు అవుతుంది.

దేశం కోసం నాన్న కన్నుమూత! రోజూ కొడుకు చేస్తున్న పని తెలిస్తే కన్నీరు ఆగవు!

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. ముఖ్యంగా ఊహ తెలియని పిల్లలు అమ్మానాన్నలను విడిచి ఉండలేరు. ఇక ఏదైనా విషాదం జరిగినప్పుడు..ఆ ఘటన తెలియని పిల్లలు చేసే ప్రవర్తన చూస్తే గుండెల్ని పిడేసినట్లు అవుతుంది. తిరిగిరాని తన వారి కోసం తిరిగి వస్తారనే ఆశతో వారు చేసే పనులు హృదయాన్ని ద్రవింప చేస్తాయి.  తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్మీగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన తన తండ్రికి.. ఇంకా బతికే ఉన్నాడనే భ్రమలో ఏడేళ్ల బాలుడు.. ఏడాదిగా వాయిస్ మేసేజ్ లు పెట్టాడు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గతేడాది  కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కల్నల్ మ్ ప్రీత్ సింగ్ అమరుడయ్యాడు. 2023 సెప్టెంబరు 13న జమ్మూ కశ్మీర్‌లోని గడోల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్‌‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం డీఎస్పీ హుమాయున్ భట్‌లు అమరులయ్యారు. అయితే కల్నల్ మన్ ప్రీత్ సింగ్ ఏడేళ్ల కొడుకు కబీర్ తన తండ్రికి వాయిస్ మేసేజ్ లు పంపుతున్నాడు. తన తండ్రి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని భావిస్తూ.. ఏడాదిగా ఈ వాయిస్ మేసేజ్ లు పంపిస్తున్నాడు. ‘ఒక్కసారి రా నాన్నా.. తర్వాత నీ డ్యూటీకి వెళ్లి పోదువు’’ అంటూ ఆ బాలుడు పెట్టిన మెసేజ్‌లు అందరి గుండెల్ని మెలిపెడుతున్నాయి.

నాన్నకు వీడియో కాల్ చేయమని తల్లిని రోజూ అడుగుతున్నాడు. ఆమె అలా చేయకపోవడంతో తల్లికి తెలియకుండా వాయిస్ సందేశాలు పంపుతున్నాడు. అంత్యక్రియల సందర్భంగా కబీర్ వీడ్కోలు పలుకుతున్న వీడియో నెట్టింల్లో అందర్ని కన్నీరు పెట్టించింది. పంజాబ్‌లోని మొహాలి జిల్లా ముల్లన్‌పూర్‌‌కు చెందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఆర్మీలో చేరారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.  జమ్ముకాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతాలైన లర్కిపోరా, జల్దూరా, కోకెర్‌నాగ్‌లో ప్రాంతాలలో ఆయన హీరోగా గుర్తుండిపోయారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఆయన్ను ధైర్యం, నిస్వార్థమైన త్యాగానికి చిహ్నంగా భావించే వారు.

ఆయనను స్థానిక ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు. ఇక కల్నల్ మన్ ప్రీత్ తాను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో రెండు చెట్లు నాటి వాటికి..తన బిడ్డల పేర్లు పెట్టాడు. పదేళ్ల తర్వాత ఈ చెట్లను చూడటానికి వెళ్దామని చెప్పి.. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని మన్‌ప్రీత్ సతీమణి జగ్మీత్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త ఎప్పటికీ రాడనే నిజం తెలియని పిల్లలు ఇంకా విధుల్లోనే ఉన్నారని నమ్ముతున్నారని చెబుతూ జగ్మీత్ ఆవేదనకు లోనయ్యారు. ప్రస్తుతం కల్నల్ మన్ ప్రీత్ కుమారుడు పంపిన వాయిస్ మేసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి