iDreamPost

Shruti Haasan: ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. నోరు మూసుకుని వెళ్లు! శృతిహాసన్ స్ట్రాంగ్ వార్నింగ్!

టాలీవుడ్ హీరోయిన్, కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా బతికేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

టాలీవుడ్ హీరోయిన్, కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా బతికేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

Shruti Haasan: ఎలా పడితే అలా పిలిస్తే ఊరుకోను.. నోరు మూసుకుని వెళ్లు! శృతిహాసన్ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇటీవల కాలంలో సెలబిట్రీలు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా స్పందిస్తూ..తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. అయితే కొందరు అడిగే అతి ప్రశ్నలు సెలబ్రిటీలకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా కమల్ హాసన్ కుమార్తె హీరోయిన్ శృతిహాసన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఓ నెటిజన్ అడిగి ప్రశ్నకు సమాధానం ఇస్తూ నోరు మూసుకుని వెళ్లూ అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ హీరోయిన్, కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటింది. తమిళ అమ్మాయే అయినా తెలుగు వారికి బాగా దగ్గరైంది. హీరోయిన్ గా కాస్తా పక్కన పెడితే.. వ్యక్తిగంతగా ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా బతికేస్తుంటుంది. నటిగానే కాకుండా సింగర్‌గానూ తనలోని మల్టీ టాలెంట్ ను ప్రదర్శిస్తుంది. అలానే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు  యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫ్యాన్స్ తో చిట్‌చాట్‌ చేస్తుంటుంది. వారు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. తాజాగా మరోసారి అభిమానులతో మాటామంతీ నిర్వహించింది.

ఈ క్రమంలో తనకు ఎదురైన ప్రశ్నపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. దక్షిణాది యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్‌ అడగ్గా.. అందుకు శృతి భిన్నంగా స్పందించింది. తాను ఇలాంటి జాతి వివక్షను అస్సలు సహించనని, తమను చూసి ఇడ్లీ, దోస, సాంబార్‌.. ఇలాంటి పేర్లతో పిలిస్తే ఊరుకోలేమని చెప్పింది.  తమను కొందరు అనుకరించలేరు.. కాబట్టి సౌత్ ఇండియన్స్ లా  ఉండాలని ట్రై చేయకండని, ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోమని ఘాటుగా చెప్పింది. సౌత్‌ ఇండియన్‌ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో శృతి రాసుకొచ్చింది.

కొన్ని రోజుల క్రితం గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగిన సంగతి తెలిసింది. ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో షారూఖ్‌ ఖాన్‌ అందరిముందు రామ్ చరణ్ ను ఇడ్లీ వడ అని పిలిచాడు. అలా పిలవడాన్ని చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా హాసన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అంత పెద్ద హీరోను పట్టుకుని స్నాక్స్‌ పేరుతో పిలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. శృతిహాసన్ నెటిజన్  ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. శృతి హాసన్‌ విషయానికి వస్తే సలార్‌ సినిమాతో సందడి చేసిన ఆమె ప్రస్తుతం డకాయిట్‌ మూవీలో అడివిశేష్‌తో కలిసి నటిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి