iDreamPost

పవన్ పరువు తీస్తూ.. లోకేశ్ కి రాపాక వార్నింగ్!

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. లోకేశ్ పై మండిపడ్డారు. ప్రస్తుతం రాపాక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. లోకేశ్ పై మండిపడ్డారు. ప్రస్తుతం రాపాక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

పవన్ పరువు తీస్తూ.. లోకేశ్ కి రాపాక వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా రసవత్తరంగా ఉంటుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రణరంగానే తలపిస్తుంది. ఏపీలో ఎన్నికలు లేకున్నా.. ఆ స్థాయిలోనే ఇక్కడి రాజకీయాలు జరుగుతుంటాయి. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తీవ్ర రచ్చకు దారి తీస్తుంది. లోకేశ్ వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వారు లోకేశ్ పై నిప్పులు చేరుగుతున్నారు. తాజాగా రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. నారా లోకేశ్ పై  ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పప్పు నాయుడు అనే పేరును సార్థకం చేసుకున్నావంటూ సెటైర్లు వేశారు.

రాపాక వరప్రసాద్ రావు… 2019 ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒక్కేఒక్క ఎమ్మెల్యే ఆయన. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019లో జగన్ ప్రభజనంలో హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. అంతటి ఫ్యాన్ గాలిని తట్టుకుని రాపాక వరప్రసాద్ రావు.. రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం వివిధ పరిణామాలతో వైసీపీ గూటికి చేరారు. ఇది ఇలా ఉంటే.. మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను రాజోల్ నియోజవర్గం నుంచి పునఃప్రారంభించిన విషయం తెలిసిందే.

రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా లోకేశ్.. స్థానిక ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో రాపాక పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. అంతేకాక జనసేనను మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ఇక లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాపాక స్పందించారు. నీకు బుద్ది ఉందా లోకేశ్, నువ్వు మనిషివా, పశువా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇంకా రాపాక మాట్లాడుతూ.. ఎవరో రాసించిన స్క్రిప్ట్ ను నువ్వు చదువుతావా?, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? మంత్రిగా కూడా చేశావు అంటూ మండిపడ్డారు. అసలు నీకు బుద్ది ఉందా?,  ఇందుకే నిన్ను అందరూ పప్పు నాయుడు అనేది. ఆపేరు పెట్టినందుకు నువ్వు కరెక్ట్ గా సరిపోయావు అంటూ సెటైర్లు వేశారు. మీ ప్రభుత్వ హాయాంలోనే ఇసుకును దోచుకున్నారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అలాంటి అవినీతిని జరగనివ్వడంలేదని చెప్పుకొచ్చారు. రాజోలులో మీ ఎమ్మెల్యే ద్వారా ఇసుక నుంచి భారీగా దోచుకున్న నువ్వు నా గురించి మాట్లాడుతావా? అంటు రాపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిచ్చిన కాగితాన్ని కూడా సరిగ్గా చదవలేని వాడివి నువ్వు నా గురించి మాట్లాడుతావా? అంటూ ప్రశ్నించాడు.

“జనసేనాను మోసం చేసి వెళ్లాను అంటావా.. ఆ పార్టీ అధ్యక్షుడే ..రాజోలు వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో పవన్ నా గురించి మాట్లాడలేదు. ఒక వేళ ఆ పార్టీని మోసం చేశానని అనుకుంటే.. పవన్ కల్యాణ్ మాట్లాడాలి. నువ్వు ఎవర్రా మధ్యలో నీకేమి హక్కు ఉంది మాట్లాడటానికి. నీ బాబు దొంగచాటుగా ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచి.. ముఖ్యమంత్రి అయ్యాడు” అంటూ రాపాక వరప్రసాద్ లోకేశ్ పై ఫైర్ అయ్యారు. మరి.. నారా లోకేశ్ పై రాపాక చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి